హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. ఈ సారి 93.54 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది 45 వేల మంది పరీక్షలకు హాజరుకాగా 42 వేల మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిపై అయిన 42 వేల మందిలో 29 వేల మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ నెల మూడో వారంలో సీట్ల భర్తీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. 251 కాలేజీల్లో 50 వేల వరకు సీట్లు ఉన్నాయని తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఫలితాల వివరాలిలా..
