‘నిజానికి ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు ‘చైనా పీస్’. ఒక పాత్రను ఉద్దేశించి ఆ టైటిల్ పెట్టాను. చైనా, గల్వాన్ యుద్ధం రావడంతో అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఏదిఏమైనా ఈ సినిమాకు ‘సీక్రెట్ సోల్జర్’ టైటిల్ సరిగ్గా యాప్ట్’ అని దర్శకుడు అక్కి విశ్వనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలు. నేడు విడుదల కానున్నది.
దర్శకుడు అక్కి విశ్వనాథ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ‘ఆసక్తిగా సాగే స్పై డ్రామా ఇది. ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఒకడు దేశభక్తిపరుడు. మరొకడు తన ఆనందమే ముఖ్యం అనుకునే స్వార్థపరుడు. ఈ రెండు పాత్రల మధ్య కథ ఆసక్తికరం’ అన్నారు.