కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు వస్తున్నాయి. వారంతా ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యమార్గాల వీలైనంత త్వరగా భారతీయులందరికీ సహాయం అందించాలి’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ జి రంజిత్‌రెడ్డి జైశంకర్‌కు లేఖ రాశారు.