హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తేతెలంగాణ): రాజ్యసభలో చరిత్రాత్మకమైన తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొంది గురువారం నాటికి 11 ఏండ్లు నిండాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గుర్తుచేశారు.
ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన విజయమని ట్విటర్ (ఎక్స్) వేదికగా అభివర్ణించారు. ఆమోదం పొందిన రోజూ కేసీఆర్ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ట్యాగ్ చేశారు.
రెండో ఏఎన్ఎంలు తాత్కాలికంగా సమ్మె విరమించినట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ ప్రకటించారు. రెండో ఏఎన్ఎంల యూనియన్(ఏఐటీయూసీ), రాష్ట్ర వైద్య వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కర్ణన్‌తో జరిగిన చర్చల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం కోఠిలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. 38 రకాల రికార్డులను రాయడంతో పాటు ఆన్లైన్ చేయాల్సి రావడంతో ఏఎన్ఎంలపై పని ఒత్తిడి పెరుగుతున్నదని పేర్కొన్నారు.