హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. అయినప్పటికీ బారికేడ్లు, మూడంచెల పోలీసు భద్రతను దాటుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దేశపతి శ్రీనివాస్ బస్ భవన్ లోపలికి చేరుకున్నారు.
పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదన అందజేయనున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు భవనకు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడు అంచల భద్రతతో పోలీసులు పహారా కాస్తున్నారు.
పోలీసులను దాటుకుని బస్సు భవన్ లోపలికి చేరుకున్న బీఆర్ఎస్ బృందం
పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేయనున్న బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/NKmCTC1SjT
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025