సమాజ సేవకుడు రామా శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్, రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాస్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు.
- వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా సేవలు
- మృతదేహానికి కేటీఆర్, హరీశ్ నివాళి
- కుటుంబసభ్యులకు పలువురి పరామర్శ
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/పోచమ్మమైదాన్: ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్, రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాస్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు తదితర ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మోక్షారామం ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కేటీఆర్, హరీశ్‌రావు స్మరించుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రామా శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు రామన్నపేటలోని శ్మశాన వాటికలో జరుగనున్నాయి.
ఆయన సేవలు అమోఘం
తల్లిదండ్రులు రామా ఆగయ్య, ఉప్పలక్ష్మి కోరిక మేరకు రామన్నపేటలో మోక్షారామం ఫౌండేషన్ ఏర్పాటుచేసి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 50 లక్షలతో శ్మశానవాటికను నిర్మించారు. పేదలు, అనాథశవాలకు అయ్యే అంత్యక్రియల ఖర్చు భరించేవారు. ఫౌండేషన్ ద్వారా నిత్య అన్నదానం చేస్తున్నారు. బిడ్దల వివాహాలు చేసే ఆర్థిక స్థోమత లేనివారికి ఇప్పటివరకు 250 మందికి మంగళసూత్రాలు, వస్ర్తాలు, నగదు సహాయం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

