హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): స్వల్ప అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గురువారం పరామర్శించారు. బీపీ సంబంధిత సమస్యతో జగదీశ్‌రెడ్డి బేగంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు.. ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.