KTR | హైదరాబాద్/కరీంనగర్, ననంబర్ 29 (నమస్తే తెలంగాణ): 15 ఏండ్ల క్రితం కేసీఆర్ ఉకు సంకల్పంతో ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ జన సామాన్యులను తట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేసి రాష్ర్టాన్ని సాధించి పెట్టారని, పదేండ్లపాలనలో మహోన్నతంగా అభివృద్ధి చేసి చూపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 11 నెలల పాలనలోనే రాష్ర్టానికి పూడ్చలేని నష్టం కలిగిచిందని, నిన్నమొన్నటి దాకా అణగిమణగి ఉన్న కొన్ని శక్తులు కేసీఆర్ దిగిపోగానే రెచ్చిపోతున్నాయ ని, ఓవైపు గుజరాత్ గులాములు, మరోవైపు ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల పరిరక్షణ కో సం మరోసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా 14 ఏండ్ల పోరాట చరిత్రను మననం చేసుకొని ఈ తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూర్తి ని రగిలించాలని కోరారు. దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం తెలంగాణభవన్, కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో ఏర్పాటు చేసిన సభ ల్లో కేటీఆర్ ప్రసంగించారు. 33 జిల్లాల్లో దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన పా ర్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారా బిడ్డలు వచ్చారని, వారి కళారూపాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం లేకిగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్ వద్ద లైట్లు బంద్‌జేసి, కరెంట్ తీసేసి, బీఆర్ఎస్ బ్యానర్లను చింపివేసి చాలా నీచంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
‘సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి మన ముఖ్యమంత్రిగా ఉన్నడు.. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎకుపెట్టిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని రెచ్చిపోతున్నడు.. ఆయన చెరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను కాదు.. తెలంగాణ ఆనవాళ్లను! అందుకే తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం.. చార్మినార్‌ను తొలిగించాలని దుర్మార్గమైన ఆలోచన చేసిండ్రు. తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేస్తా అంటున్నడు.. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి స్థానా న్ని కబ్జాపెట్టి రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నడు’ అం టూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
‘స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ప్రస్తుత పార్లమెంట్ లో మన గళం వినిపించేవాడే లేడు. తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టే వాడే లేడు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు అదానీలు, ప్రధానిలు ఇకడ అడుగు పెట్టే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ మీద పట్టుకో సం వస్తున్నరు. ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు. కవులు, కళాకారులు, మేధావులు తెలంగాణపై జరుగుతున్న దాడిని గుర్తించాలి. ఈ తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూ ర్తిని రగిలించాలి’ అని పిలుపునిచ్చారు.
చరిత్ర చదవకుండా భవిష్యత్తును నిర్మించలేమని, గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్ణయించుకోలేమని కేటీఆర్ చెప్పారు. ‘ప్రతి జా తి తన వైభవాన్ని, పోరాటాలు, త్యాగాలు, విజయాలను, కథగానో, పాటగానో, ఏదో కళారూపంలో నిత్యం గానంచేస్తూనే తర్వాతి తరాలకు అందిస్తూ ఉంటుంది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురుతో ఉన్న యువతకు పౌరుషాన్ని నూరిపోస్తూనే ఉంటుంది’ అని గుర్తుచేశారు.
‘1948 నుంచి 1956 వరకు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఉండే. ఆనాటి హై దరాబాద్ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా 1956లో ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేశారు. ఈ బంధం సరిగా లేకపోతే ఎప్పుడైతే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని నాడు నెహ్రూ అన్నట్టుగానే జరిగింది. రాష్ట్రం మెదటి రోజు నుంచే కుట్రలు చేశారు. 1956 నుంచి 1969 వరకు తెలంగాణ లోలోపల ఉడికి పోయింది. 1969 నుంచి 1971 వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. బలవంతపు పెళ్లి చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని కరషంగా అణచివేసింది.
ఇందిరాగాంధీ హయాంలో కూడా తెలంగాణ ప్రజలు 14 సీట్లకు గాను 11 సీట్లు తెలంగాణ ప్రజా సమితికి ఇచ్చి తెలంగాణ కోరిక ఎంత బలంగా ఉన్నదో చాటి చెప్పారు. కానీ, ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ ఆకాంక్షను అదిమిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నది. తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారని ఉన్న అపవాదును కేసీఆర్ 2001లో పదవుల త్యా గంతో పార్టీని ప్రారంభించి పోగొట్టారు. రాష్ర్టా న్ని సాధించి మహోన్నతంగా అభివృద్ధి చేశా రు’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
‘కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది. మ్రూసీ, హైడ్రా, లగచర్ల బాధితులు సాయం కోసం తెలంగాణ భవన్‌కు వస్తున్నరు. తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ మాత్రమే. మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో.. కానివా ళ్లు ఎవరో గుర్తించాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
మన జాతికి మహత్తరమైన పోరాటాల చరి త్ర ఉన్నదని, ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మన సొంతమని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కుట్రలు, కుతంత్రాలను ఛేదిం చి, యావత్ జాతిని ఏకతాటిపై నడిపించి శాం తియుత పంథాలో వ్యూహాలు, ఎత్తుగడలు ర చించి, ఉకు సంకల్పంతో, చెకు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు మనకున్నాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో దండియాత్ర, సహాయ నిరాకరణ, ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మలిదశ తెలంగాణ పోరాటంలో మహోజ్వల సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశం’ అని కేటీఆర్ చెప్పారు.
ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుం దో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మ గ్గిపోతుందని కేటీఆర్ హెచ్చరించారు. ‘ఒక ప్రాంతాన్నో, దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు పరాజితుల చరిత్రను చెరిపేస్తారు. తెలంగాణ ఏర్పడితే ఇకడి నాయకత్వానికి పాలించే సత్తా లేదని మనపై దాడి జరిగింది. వాటిని పటాపంచలు చేస్తూ దేశం గర్వించేలా చేసిన చరిత్ర కేసీఆర్‌ది’ అని గుర్తుచేశారు.
ఒకసారి ఆదమరిచి, అప్రమత్తంగా లేకుం డా ఒక పొరపాటు చేస్తే 60 ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డదని, మూడు తరాలు పీడనకు బలై పోవాల్సి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘అందుకే.. తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమయాది? మళ్లా ఎం దుకు పోరాట చరిత్ర అనుకుంటే అది పెద్ద పొ రపాటు అవుతుంది. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలియాలి. అందరికీ నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో తెలిస్తేనే ఈ జనరేషన్ జాగ్ర త్త నేర్చుకుంటది’ అని చెప్పారు.
సోనియమ్మ లేకుంటే తెలంగాణ అడుకుతినేదని సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంతో అడ్డగోలుగా వాగుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజాపోరాటాన్ని, అమరవీరులను కించపర్చుతున్నారని మండిపడ్డారు. ‘ఒక గుజరాతీ వచ్చి విడిపించాడు. ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలాంటి వాళ్లతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉన్నది. ఈ సమయంలో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకుంటే తప్పు చేసినవాళ్లమవుతం’ అని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ ఒక హిమాలయ శిఖరంలా నిలిచి పోతారని, ఆయన చరిత్రను చెరిపేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ అనేది పేరు కాదని, అది తెలంగాణ పోరు అని స్పష్టం చేశారు. తెలంగాణ కో సం ఆయన పలికిన ప్రతి మాట ఒక తూ టా లా పేలిందని, ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి ఉద్యమాన్ని నడిపించిందని గుర్తుచేశా రు. అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టు తె లంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని తెలి పారు. కేసీఆర్‌తోపాటు నాయిని నర్సింహారెడ్డి, ఫ్రొఫెసర్ జయశంకర్ లాంటి పలువురు ప్ర ముఖులు అరెస్టయినపుడు రాష్ట్రమంతా భ గ్గున మండిందని చెప్పారు. శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్యలాంటి వాళ్లు ఎందరో తమ ప్రాణాలను అర్పించారని, ఈ దుర్ఘటనలు చూసి కేసీఆర్ తమ ముందే బోరున విలపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోవడంవల్ల ఇషాంత్‌రెడ్డి, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి ఇలా వం దల మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి ఆనాటిదని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ వాదులు మరోసారి పోరుబాట పట్టాల్సి న అవసరం ఉన్నదని కేటీఆర్ స్పష్టంచేశారు. ఏ క్రూరమైన కాంగ్రెస్ దశాబ్దాల పాలన మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లా చెదురు చేసిందో, మళ్లీ అదే దుర్మార్గులు మోసపూరిత హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అమ లు చేయకుండా ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తి, దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి కదంతొక్కుదామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ప్రజల పక్షాన కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.
‘రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 5,19,605 క్వింటాళ్ల వడ్లకు బోనస్ ఇచ్చారు..ఈ లెక్కలను చూస్తేనే సర్కారు చిత్తశుద్ధి తెలుస్తున్నది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతులకు రూ.1.5 కోట్ల ఎకరాలకు ఎగ్గొట్టిన రైతుభరోసా ఎంత? కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎగ్గొట్టిన నగదు ఎంత? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని కోట్లు ఎగ్గొట్టి, ఇప్పటివరకు ధాన్యానికి ఇచ్చిన బోనస్ రూ.25.98 కోట్లేనని శుక్రవారం ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. ‘కొన్నది పిసరంత..కోతలు కొండంత’ అని ధ్వజమెత్తారు. పండుగలాంటి వ్యవసాయం కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండుగలా మారిందని మండిపడ్డారు.
ఓ పక్క గుజరాత్ గులాములు.. మరో పక్క ఢిల్లీ కీలుబొమ్మలు నక్కి ఉన్నరు. వీళ్లతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు, నిధులు, నియమకాలు ఉద్యమ నినాదమే కాదని నీల్గుతున్నరు. అదానీ, ప్రధాని తొక్కుకుంటూ వస్తున్నరు.. వారిని ఎదిరించేందుకు భాస్వరమై మండాలె.. ఆత్మగౌరవం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకుంటే తప్పు చేసినవాళ్లమవుతం.
-కేటీఆర్
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణభవన్ వరకు సుమారు 200-300 మీటర్ల దూరం వరకు కేటీఆర్ ర్యాలీ ప్రారంభించబోతుండగా వీధి దీపా లు బంద్ అయ్యాయి. అంతా చీకటి అలుముకున్నది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటుచేసిన బ్యానర్లు ధ్వంసమై, చిరిగిపోయి ఉన్నా యి. ఇదే విషయంపై దీక్షా దివస్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణభవన్ వ ద్ద లైట్లు బంద్‌జేసి, కరెంట్ తీసేసి, బీఆర్ఎస్ బ్యానర్లు చించివేసి ప్రభుత్వం నీచం గా వ్యవహరించిందని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహిం చిన దీక్షా దివస్ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కరీంనగర్ జిల్లా అల్గునూర్, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కా ర్యక్రమాలకు కేటీఆర్ హాజరయ్యారు. అల్గునూర్ వెళ్తుండగా ఎల్ఎండీ కాలనీ వద్ద అ మరుల స్ఫూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ ద్వా రా ఓపెన్ టాప్ కారులో అల్గునూర్ వచ్చిన కేటీఆర్, చౌరస్తాలో కేసీఆర్‌ను అరెస్టు చేసిన చోట ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు కేటీఆర్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి భారీ ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. అక్కడ ముందుగా కేటీఆర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మ ధుసూదనాచారి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జ యశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
సభా వేదికపై ఏర్పాటుచేసిన అమరవీరుల స్తూపానికి పూలుజల్లి నివాళులర్పించా రు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రెండు చో ట్లా కేటీఆర్ ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావుగౌడ్, పొన్నాల లక్ష్మ య్య, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశం, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, స్వామిగౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దా సోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, సాయి కిరణ్, గజ్జెల నగేశ్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అల్గునూర్‌లో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జడ్పీ మాజీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ పాల్గొన్నారు.
ప్రతిజాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికో కథ ఉంటది. ఆ కథలో కథనాయకులు, ప్రతినాయకులు.. త్యాగాలు, విద్రోహాలు, విజయాలు.. గుణపాఠాలు ఉంటయి. తెలంగాణ కథలో కూడా కథానాయకుడు.. తెలంగాణ తల్లికి జన్మించిన తనయుడు కేసీఆర్.. అందుకే మన చరిత్రను రేపటి తరానికి, ఆ కథను గాథను నరనరాన ఎకించాలి. లేకపోతే ఆ జాతి మళ్లా పరాయి దండయాత్రలతో ఓడిపోయే ప్రమాదం ఉంటది.
-కేటీఆర్
‘కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో మహిళలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆనాడు బ్రిటిషర్లు చేసిన దానికన్నా అరాచకాన్ని సాగించింది. బందిపోట్ల మాదిరిగా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. మన పోరాటానికి తలొగ్గిన ప్రభుత్వం లగచర్లలో భూముల సేకరణను విరమించుకున్నది. ఇది బీఆర్ఎస్ విజయం. తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీలు, రైతుల విజయం. ఈ రియల్ ఎస్టేట్ బేహారికి పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియ ల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరో రూపంలో మీ భూము లు కావాలని మళ్లీ వస్తడు. జాగ్రత్తగా ఉండాలే’ అని కేటీఆర్ చెప్పారు
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఎంత కీలకంగా మారిందో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష అంత కీలకంగా మారిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చెప్పారు. తెలంగాణ భవన్లో లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రా ణత్యాగానికి తెగించి చేపట్టిన ఆమరణ దీక్షకు తెలంగాణ ప్రజలు నీరాజనం పట్టారని గుర్తుచేశారు. జైత్రయాత్రో? చావుయాత్రో?నని తెగించి ఉద్యమిం చి కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించిపెట్టారని చెప్పారు. నాడు బీఆర్ఎస్తో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకొని గెలిచి మోసం చేశాయని మండిపడ్డారు.
తాను 2009లో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పుడు వేరే పార్టీ లో గెలిచానని, నాడు కేసీఆర్ అరెస్టు తో తాను ఎంతో స్ఫూర్తి పొందానని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పే ర్కొన్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుం చి కరీంనగర్ వస్తున్నపుడు కార్యకర్తలు సైనికుల్లా కాపలా ఉండేవారని, వారిని దాటి కేసీఆర్ వద్దకు వెళ్లాలంటే పోలీసులకు సాధ్యం కాకపోయేదని, అ లాంటి కేసీఆర్‌ను 2009 నవంబర్ 29న మోసం చేసి అల్గునూర్ చౌరస్తా లో పోలీసులు అరెస్టు చేశారని గుర్తుచేశారు. అల్గునూర్ సభలో గంగుల మా ట్లాడుతూ కేసీఆర్‌ను అరెస్టు చేసిన రో జు రాయలసీమ, ఆంధ్రా నుంచి వేలా ది మంది పోలీసులను రప్పించారని చెప్పారు. నాడు కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందని స్పష్టంచేశారు.
కేసీఆర్ పోరాటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందని మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ పేర్కొన్నా రు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సిం గ్ తరుచూ కేసీఆర్ గురించే మాట్లాడే వారని, తెలంగాణలో అభివృద్ధిని అభినందించేవారని గుర్తుచేశారు. ఐక్యరా జ్య సమితి కూడా కేసీఆర్ చేసిన అభివృద్ధిని అభినందించిందన్నారు.