KTR | ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.15వేల రైతు భరోసా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మోసం చేయడం వల్లే ఈ రైతన్న నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. పెట్టుబడి సాయం మాట దేవుడెరుగు.. కనీసం ఇటీవలి తుఫాను వల్ల నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించినా ఈ కౌలు రైతు కుటుంబం రోడ్డున పడేది కాదన్నారు. ఓవైపు 700 మందికిపైగా రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో మరణమృదంగం మోగుతుంటే.. రేవంత్ సర్కారు విజయోత్సవాల పేరిట డ్రామాలు చేయడం సిగ్గుచేటన్నారు.
రియల్ ఎస్టేట్ దందాలు, కుంభకోణాలు తప్ప కర్షకుల కష్టాల గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. కౌలు రైతు వీరన్న సెల్ఫీ వీడియో చూసిన తర్వాతైనా రేవంత్ ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో అన్నదాతలకు చేసిన మోసాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మోగుతున్న ఈ చావుడప్పును ఇకనైనా ఆపకపోతే కాంగ్రెస్ సర్కారుకు లక్షలాది మంది రైతులే సమాధి కడతారని.. ఆత్మహత్య చేసుకున్న వీరన్న కుటుంబానికి కనీసం 25 లక్షల పరిహారం అందించి, కష్టాల కడలి నుంచి ఆ కుటుంబాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందన్నారు.
కౌలురైతుది ఆత్మహత్య కాదు..
కాంగ్రెస్ చేసిన హత్యఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలురైతు వీరన్న బలవన్మరణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే.
కౌలు రైతులకు కూడా ఏటా రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మోసం చేయడం వల్లే ఈ రైతన్న… pic.twitter.com/cjgncdwL8D
— KTR (@KTRBRS) December 1, 2025