KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ముసుగులో అవినీతి పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పనులు జరుగాలంటే కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారని గుర్తుచేశారు.
KTR |హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ముసుగులో అవినీతి పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పనులు జరుగాలంటే కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే స్పష్టంచేస్తున్నాయని చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కమీషన్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఇక ప్రజలకు ఈ పాలనపై ఎలాంటి నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో వచ్చేది గులాబీ జెండానేనని, తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, ఆ సొమ్మును పూర్తిగా కకిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యం, పెన్షన్ల కోతలు, మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, తెలంగాణ ఆత్మగౌరవం తదితర అంశాలపై కేటీఆర్ మాట్లాడారు.

Ktr
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వ బట్టలు విప్పుతున్నరు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇవ్వనిదే అభివృద్ధి పనులు జరుగడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పనులు కావాలంటే 15 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తున్నదని బహిరంగంగా చెప్పారని పేరొన్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి ర%B
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
Horoscope | 20-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Revanth Reddy | ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్..తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు
Revanth Reddy | సీఎం సభ అట్టర్‌ఫ్లాప్.. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెళ్లిపోయిన జనం
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ వర్సెస్ రాజగోపాల్.. రెండు రోజులుగా సీఎంను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

