Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నాగార్జునసాగర్ చేరుకున్న ఈ బృందం సాగర్ ప్రధాన డ్యాం, స్పిల్ వే మరమత్తు పనులను పరిశీలించారు.
మంగళవారం ప్రధాన డ్యామ్‌కు పక్కనే ఉన్న డైవర్షన్ టన్నల్ పై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం కుడి కాలువ ప్రధాన ద్వారం, దానితో పాటు కుడికాలువపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాన్ని సందర్శించి ఎంత మేరకు నీరు వెళ్తుంది అనే దానిని పరిశీలించారు. తరువాత టెల్ పాండ్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ బృందంతో పాటు కేసీఆర్ఎంబీ సభ్యులు అజయ్ కుమార్ గుప్తా, రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.