హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని అమరావతికి లేదా విజయవాడకు తరలించాలని ఏపీ జలవనరుల శాఖ ఈ ఎన్సీ వెంకటేశ్వరావు కోరారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని బుధవారం కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉన్నదని, దీనిపై అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశంలోనూ అంగీకారం కుదిరిందని ఆ లేఖలో గుర్తుచేశారు.