హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గానూ సురేశ్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ నియామకలను తెలియజేస్తూ రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు కేసీఆర్ లేఖలు రాశారు.
ప్రస్తుతం ఈ హోదాల్లో కే కేశవరావు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ పార్లమెంటరీ నేతగా నియమించినందుకు కేసీఆర్‌కు సురేశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో సురేశ్‌రెడ్డిని రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, ఇతర ఎంపీలు, పార్టీ నేతలు అభినందించారు.