KP Vivekananda | రెండున్నరేళ్ల తర్వాత.. బండి సంజయ్ గుజరాత్, యూపీ వెళ్లి బతకాల్సి వస్తుంది.. కేపీ వివేకానంద కీలక వ్యాఖ్యలు
KP Vivekananda | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెనుక రేవంత్ రెడ్డి సహకారం ఉందని ఆరోపించారు.
KP Vivekananda | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెనుక రేవంత్ రెడ్డి సహకారం ఉందని ఆరోపించారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. 2014కు ముందు బండి సంజయ్ చందాలతో బతికేవాడని అన్నారు. కానీ ఇప్పుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరు మాట్లాడిన భాషలోనే మీకు సమాధానమిచ్చామని తెలిపారు.
పాడి కౌశిక్ రెడ్డిపై పథకం ప్రకారమే దాడి జరిగిందని కేపీ వివేకానంద తెలిపారు. కౌశిక్ రెడ్డిపై హత్యకు సామాగ్రితో వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తే.. రెండున్నరేళ్ల తర్వాత బండి సంజయ్ గుజరాత్, యూపీకి వెళ్లి బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. పదేళ్లలో తాము ఎంతో ఓపికగా ఉన్నామని తెలిపారు. అన్ని ఆధారాలతో డీసీపీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం కేసులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

