హరీశ్ సవాల్‌ను స్వీకరించు
రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్ధాల పునాదుల మీద మొదలైందని ఎద్దేవా చేశారు.
- రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించాలి
- ఓటమి భయంతోనే దేవుడిపై ఒట్లు
- రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్ధాల పునాదుల మీద మొదలైందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరించలేకపోతున్నారని, మాటల గారడీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్‌రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని విమర్శించారు.
ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోలేకపోతే, సీఎం పదవికి ఎసరు వస్తుందన్న భయంతోనే దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు అంటే ప్రజల్లో నమ్మకం ఉన్నదని, ఆయన రాజీనామా సవాల్‌ను ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామా పత్రాన్ని తనకు ఇష్టమైన వ్యక్తి దగ్గర పెట్టాలని సవాల్ చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెండుసార్లూ మాట తప్పారన్నా రు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేటప్పుడు రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్‌కు కాకుండా చంద్రబాబుకు పంపారని గుర్తుచేశారు. హరీశ్‌రావు రాజీనామాపై మాట్లాడే ముందు రేవంత్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

