ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 22 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో తనకు గుర్తింపు ఇవ్వలేదని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫైర్ అయ్యారు.
ఫ్లెక్సీలో సైతం తన ఫొటో లేదని, కేవలం కాంగ్రెస్ నాయకుల ఫొటోలను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికారులు, నిర్వాహకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి క్షమాపణ చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఆమె సభను వాకౌట్ చేసి వెళ్లిపోయారు.