హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువును కబ్జా చేశాననేది పూర్తి నిరాధారమని ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశం మేరకు యాక్షన్ పెడితే 2014లో దుర్గంచెరువు పార్క్ రోడ్డులో రెండెకరాలు కొనుగోలు చేశామని, అది ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్టు తేలడంతో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశామని గుర్తుచేశారు.
సినీ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పకనే ఉన్నాయని, అక్కడ చాలామంది వాహనాలను పార్కింగ్ చేస్తారని, రోడ్డుపై, చెట్ల కింద వెహికిల్ పారింగ్ చేసినందుకు తనపై కక్షపూరితంగా కేసు పెట్టారని ఆరోపించారు. కబ్జా చేసినట్టు నిరూ పిస్తే దేనికైనా సిద్ధమని ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు.