MLA Sanjay | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీజలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఒక్కటే ప్రెస్మీట్లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే ఉరి తీయాలి అంటాడని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు.. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్ధం కదా అని ప్రశ్నించారు. కసబ్ లెక్క ఎవరిని ఉరితీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్ లాగా ఉరి తీస్తారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రూల్స్ మొత్తం ఈయనే రూల్ చేసినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు
ఒక్కటే ప్రెస్మీట్లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే ఉరి తీయాలి అంటాడు
అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు.. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించాడని అర్ధం కదా!!
రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు… pic.twitter.com/owmQZG4itE
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026
పాలమూరు బిడ్డగా పాలమూరును కాపాడుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇప్పటికైనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ వచ్చి సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మరి జూరాల ప్రాజెక్టు కింద క్రాప్ హాలీడే ప్రకటించింది మీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. కేఎల్ఐలో ఇప్పటికీ పుష్కలంగా నీళ్లు ఉన్నాయని తెలిపారు. కానీ ఆదిత్యనాథ్ దాస్ సలహాతో జూరాల నుంచి లిఫ్ట్ చేయాలని అంటున్నాడని పేర్కొన్నారు. దయచేసి ఇప్పటికైనా మంచి సలహాదారుడిని పెట్టుకోవాలని సూచించారు. ఆంధ్రా అడ్వైజర్‌ను తీసేసి తెలంగాణ అడ్వైజర్‌ను పెట్టుకోవాలని అన్నారు. నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకు ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ సోయి ఉన్నోడు అడ్వైజర్‌గా ఉండాలని స్పష్టం చేశారు.
దయచేసి ఒక మంచి అడ్వైజర్‌ను పెట్టుకోండి.. ఆంధ్ర అడ్వైజర్‌ను తీసేసి తెలంగాణ అడ్వైజర్‌ను పెట్టుకోండి
నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకు ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ సోయి ఉన్నోడు అడ్వైజర్‌గా ఉండాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ pic.twitter.com/EWqgEAMXpI
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026
నికర జలాలు ఉండగా, వరద జలాల నుంచి లిఫ్ట్ ఎలా చేస్తారని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటికే ఒక మోటార్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేశామని గుర్తుచేశారు. ఇవాళ, రేపు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ గురించి అర్థం కావడం లేదని ఎమ్మెల్యే సంజయ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బాగా ప్రిపేర్ అయ్యి సభకు రావాలని సూచించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ ఈసారి అయినా పూర్తిగా ప్రిపేర్ అయి రండి – ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ https://t.co/jZUziVHDea pic.twitter.com/KJeIlPvCEj
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026