Korrameenu Fish | అయిజ : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆరడగుల కొర్రమీను జాలర్లకు చిక్కింది. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ముచ్చోనిపల్లి రిజర్వాయర్ నుంచి పొలాలకు సాగునీరు పారే కాల్వలో 10 కిలోలకుపైగా ఉన్న కొర్రమీను(కొర్రమట్ట) రైతు బోయ హన్మంతుకు లభించింది. రిజర్వాయర్ నుంచి కాల్వకు నీటి విడుదల తగ్గడంతో పలువురు రైతులు చేపలు పట్టగా అరుదుగా ఉండే పొడవైన చేప చిక్కింది. ఇక ఈ చేపను చూసేందుకు రైతులు, స్థానికులు ఎగబడ్డారు.
ఇవి కూడా చదవండి..
Telangana Cabinet | 30న తెలంగాణ కేబినెట్ భేటీ