గోదావరిఖని, జనవరి 25: రాష్ట్రంలో రే వంత్‌రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆయన మా ట్లాడారు. సింగరేణిలో గతంలో ఎ ప్పుడూ లేనివిధంగా సైట్విజిట్ పేరుతో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్ర హం వ్యక్తంచేశారు. నైనీ బొగ్గు బ్లాక్‌తోపాటు సింగరేణి సం స్థకు సంబంధించి ఏడు బొగ్గుబ్లాక్‌ల నుంచి రూ.6 వేల కోట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించారని ఆరోపించారు. కుంభకోణంపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను సిట్ విచారణ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.