హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రజతోత్సవ సభకు వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రజతోత్సవ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా సభాస్థలానికి దగ్గరలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.