గోదావరిఖని, జూలై 21 : సింగరేణి కార్మిక హక్కుల సాధన టీబీజీకేఎస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌ను వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. టీబీజీకేఎస్ నాయకులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌చేశారు.
ఈ నెల 23న కోల్‌బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీని కలిసి బదిలీని నిలిపివేయాలని కోరనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.