మంచిర్యాలటౌన్, మార్చి 5: సాధ్యంకాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై(Congress government) ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు. మంచిర్యాల నియోజక వర్గంలోని దండేపల్లి, లక్షెటిపేట మండలాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అదే విధంగా మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో హాజీపూర్, నస్పూర్, మంచిర్యాల పట్ట ణాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసమే పుట్టిన ఉద్యమ పార్టీని ప్రజలు గెలిపించుకుంటారని, ఇక్కడి ప్రజల తరపున పార్లమెంటులో గళం విప్పాలంటే కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ అయితేనే సాధ్యపడుతుందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్ మోసాలను వివరించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా పెద్దపల్లి జిల్లాకు పేరుందదని గుర్తు చేశారు.
ఈ ప్రాంతంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం తెలిసిన వ్యక్తి అయితేనే బాగుంటుందని, అధినేత కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో కేసీఆర్ నాయ కత్వంలో అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. అన్ని మతాల విశ్వాసా లను, మనోభావాలను కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.