జగిత్యాల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు దండుకునేందుకు సీఎం రేవంత్ కొత్త ఎ త్తుగడలు వేశారని విమర్శించారు. క్యాబినెట్ ఆమోదం, ఆర్డినెన్స్ తయారీ, గవర్న ర్ ఆమోదం అంటూ బీసీ వర్గాలను త ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. 42% రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదని, చట్టం చేసినా తదుపరి రక్షణ కల్పించాలంటే, 9వ షెడ్యూల్లో చే ర్చాల్సిన అవసరం ఉంటుందని తెలిసీ బీసీ వర్గాలను మోసం చేసేందుకు య త్నించారని ఆరోపించారు.
బీసీల సం క్షేమం కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టంచేశారు. పార్టీ తరఫున స్థానిక సంస్థల టికెట్లలో 42% ఇచ్చామని గుర్తుచేశారు. బీసీలకు ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించి, బీసీ కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఈ నెల 14న కరీంనగర్ లో నిర్వహించే సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. ఈ సభకు జగిత్యాల జిల్లా నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఎస్సారెస్పీలో 43 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ప్రాజెక్టు పరిధిలో 9,65,000 ఎకరాల ఆయకట్టు ఉన్నదని, ఈ సారి కేవ లం 6 లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చే పరిస్థితే ఉందని వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నడిపించాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 600 మంది రైతులు ఆత్మహత్య చేసున్నారంటే రేవంత్ పాలన ఎలా ఉందో అర్థం అవుతున్నదని ఎద్దేవాచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.