హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు నెలల్లో ఏం సాధించిందని విజయోత్సవాలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైడ్రా పేరిట ప్రజలను రోడ్డుపైకి తెచ్చినందుకా? దళితులకు రెండో విడత దళితబంధు ఇవ్వనందుకా? నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలైనందుకా? గురుకులాల్లో 42 మంది విద్యార్థులు మరణించినందుకా? అని నిలదీశారు.
రేవంత్రెడ్డి పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజు ల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామ ని చెప్పి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ను తిట్టడం మాని 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.