హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం సాధించాక నాడు కేసీఆర్ సింగరేణి(Singareni) కార్మికుల అనేక సమస్యలను పరిష్కరించారని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో భాగంగా సోమవారం మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే-7,ఆర్కే-7ఎన్టీ గనుల వద్ద కార్మికులతో కలిసి గేట్ మీటింగ్లో పాల్గొన్నారు.
ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి కార్మికులు ఉద్యమ సమయంలో ఎంతో చురగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరించడంతో బీఆర్ఎస్కు, సింగరేణి కార్మికులకు అవినాభావ సంబంధం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. దీనిని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉంది. నాకు ఒక్క అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానని హామీనిచ్చారు.