హైదరాబాద్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకొని ఏండ్ల తరబడి ఉన్నవారిని రోడ్ల మీద వేయటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. విపక్షం లో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి మాట్లాడినదానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇచ్చిన హామీలను గాలికొదిలి హైదరాబాద్లో భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కూల్చివేతల భయంతో గంధ శ్రీకుమార్ (55)అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారని, అది గుండెపోటు మరణం కాదని, స ర్కారు చేసిన హత్యగా కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని మండిపడ్డారు.