Koppula Eshwar : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడమే ఆలస్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం కమర్షిల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ శుక్రవారం కొప్పుల ఈశ్వర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.993కు పెంచడం ద్వారా సామాన్యుడి నడ్డి విరిచిందని, ఒక్కసారిగా 30-35 శాతం పెంపు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మోడీ సర్కార్ నిర్ణయం ద్వారా సామాన్యుల జీవన ప్రమాణాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే గ్యాస్ భారం మోపిన మోడీని కొప్పులు ఈశ్వర్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం ‘అమృత్ కాల్ అని గొప్పలు చెబుతూ ప్రజలను దారుణంగా మోసం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడితో భయపడి రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు అని ఈశ్వర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరల పెంపును ఉపసంహరించు కోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.