గజ్వేల్, అక్టోబర్ 3: మహిళ అన్న విషయా న్ని మరిచి మం త్రి కొండా సురే ఖ సభ్య సమా జం తలదించుకునేలా సినీనటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి సురేఖకు మహిళలపై ఏ మా త్రం గౌరవం లేదని విమర్శించారు.
తలదించుకునేలా సురేఖ వ్యాఖ్యలు
కృష్ణ కాలనీ, అక్టోబర్ 3: మంత్రి కొండా సురేఖ వ్యా ఖ్యలు సభ్య సమా జం తలదించుకునే లా ఉన్నాయని వ రంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నా రు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సినిమా రంగాన్ని రాజకీయాల్లోకి లా గి సమంత-నాగచైతన్య కేటీఆర్ వల్లనే విడిపోయారని మాట్లాడటం సిగ్గుచేటని అన్నా రు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చింది, కూల్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు.