తాడ్వాయి, మార్చి 23: మేడారం సమక్మ-సారలమ్మ కొమ్ము పూజారి సిద్దబోయిన సాంబశివరావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందా రు. రెండేండ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే క్రమంలో ఆయన కొమ్ము ఊదుతూ తల్లికి స్వాగతం పలికేవారు. వారం రోజులుగా అనారోగ్యంతో సాంబశివరావు బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. సాంబశివరావుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.