హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రె స్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాటిచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ కాంగ్రెస్ తనను పక్కకు పెట్టిందని వాపోయారు.
మీడియా తో చిట్‌చాట్‌లో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నలుగురు ముఖ్య నాయకులకు పదవులు ఇచ్చారని, తనకు మాత్రం మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతోపాటు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చారని, అతడి కుమారుడు వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. కానీ… తనను పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.