మునుగోడుకు ఇదేం శాపం!
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
- అధికార పార్టీలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు
- మనసు చంపుకొని సీఎం, డిప్యూటీ సీఎంను కలిశా
- నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడాల్సి వస్తున్నది
- నిధులు రాకపోతే నేనేం చేస్తానో అందరికీ తెలుసు
- ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి
మునుగోడు, నవంబర్ 2 : అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ నినో ప్రభావం, పంటల నష్టాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడుకు పవర్ఫుల్ లీడర్‌గా ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసు చంపుకొని సీఎం, డిప్యూటీ సీఎం దగ్గరికి నిధుల కోసం వెళ్లాను. మోసం చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్లొద్దని అనుకున్నా. అయినప్పటికీ వెళ్లి అడిగినా నిధులు ఇవ్వలేదు. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు నియోజకవర్గంలో చేపట్టిన పనులు పక్కన పెట్టారు. కాంట్రాక్టర్ల బాధ చూడలేక నేను మంత్రుల చుట్టూ తిరుగుతున్న. నిధులు రాకపోతే నేనేం చేస్తానో అందరికీ తెలుసు. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. చావైనా, బతుకైనా మునుగోడే అనుకున్న.
నేను ప్రజల కోసం పనులు చేయలేకపోతే పదవి ఉన్నా దండుగే. వేల కోట్ల రూపాయలతో భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్న ప్రభుత్వం స్థానికంగా చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి నీటి వనరులను పెంపొందించాలని ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా నీళ్ల మంత్రి పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ఆయన కోదాడకే మంత్రా? తెలంగాణకు మంత్రి కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత మంతులకు లేదా? అని నిలదీశారు. తాను మంత్రిని కాకపోయినా ప్రస్తుతం మంత్రుల కంటే సాగు నీటి అంశాలపై ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తినని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ సత్యం, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ ప్రేమకరణ్‌రెడ్డి, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

