ఆసిఫాబాద్: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం వెంట హోంమంత్రి మహమూద్ అలీ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.
కాసేపట్లో చిల్డ్రన్ పార్క్‌లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించనున్నారు. తర్వాత జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం బహిరంగసభలో పాల్గొననున్నారు.