హైదరాబాద్, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే తారక రామారావు నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్లో భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వాల్మీకి జయంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.