హైదరాబాద్, జనవరి25 (నమస్తే తెలంగాణ): బీజేపీ వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు నియమితులయ్యారు. గురువారం ఆయనకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియామకపత్రం అందజేశారు.
తనకు పదవి ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులందరినీ ఐక్యంచేసి, వారి హకుల కోసం పోరాడుతానని చెప్పారు.