హైదరాబాద్, మే 13 (నమస్తేతెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై ఐదురోజులైనా అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు.
సామాన్యులకు ఓ న్యాయం? భగీరథ్‌కు మరో న్యాయమా? అని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడంలేదని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో రెండు పార్టీల కుట్రలకు సమాధి కడుతారని హెచ్చరించారు.