Kodangal | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు.
దసరా పండుగ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన సొంతూరు కొండారెడ్డిపల్లెలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడ దసరా ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్.. అనంతరం తన నియోజకవర్గం కొడంగల్‌కు బయల్దేరారు. దీంతో కొడంగల్ చౌరస్తాతో పాటు సమీప రహదారుల్లో పోలీసులు.. సాధారణ ప్రజల వాహనాలను గంటల తరబడి ఆపేశారు. గంటల తరబడి వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు, వాహనదారులు తిరగబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వాహనదారులు, ప్రజలు ఆందోళనకు దిగారు. సీఎం రాక పేరిట గంటల తరబడి ఎందుకు ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. తమకు ఎమర్జెన్సీ ఉంది.. హాస్పిటల్‌కు వెళ్లాలని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్న పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం వస్తున్నాడని వాహనాలను గంటల తరబడి ఆపడం సరికాదని కొడంగల్ ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు
రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేసిన పోలీసులు
ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు
వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి
ఈ నేపధ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా… pic.twitter.com/UUJBolDCoK
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2025