హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చినట్టు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడుభూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల మంది రైతులకు చెందిన 6 లక్షల 70 వేల ఎకరాల సమస్య తీరినట్టు పేర్కొన్నారు.