హైదరాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ) : రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు. యాచారం మండల కేంద్రంలో తన చిన్నాయన ఇచ్చిన భూమిని వ్యవసాయశాఖ అవసరాలకు కేటాయించాలని కోరారు. నిజామాబాద్, నారాయణపేట జిల్లా ల్లో వలస వెళ్తున్న కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, సహకారం అందించేందు కు ‘మొబైల్ వలస సహాయ కేం ద్రం’ను మంత్రి తుమ్మల శనివారం ప్రారంభించారు. అంతర్జాతీయ వలస నివారణ సంస్థ(ఐఓఎం), ఎఫ్ఏవో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.