1600 కోట్ల బొగ్గు మాయంపై విచారణ జరపాలి
రాష్ట్రంలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్.. సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకమని, ఈ సంస్థ ద్వారా 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తికి, దేశ ఇంధన భద్రతకు సింగరేణి కీలకమని గుర్తు చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణమే చర్యలు చేపట్టకపోతే సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సమీక్షల ద్వారా వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్దాలని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కిషన్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

