హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమ స్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లే దని, రేవంత్‌రెడ్డికి ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన బ్రాండ్ ఏంటో చూద్దామని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మా ట్లాడారు. అదనపు పథకాల కారణంగా కేంద్రానికి భారీగా ఖర్చు పెరిగిందని, అందుకే అప్పులు తెచ్చుకుంటున్నామని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో తాను షేర్ చేసిన వీడియోలపై కేసు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 17న వక్ఫ్ బోర్డుపై వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు.