హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని మండిపడ్డారు. ఎన్టీ వీ జర్నలిస్టుల అరెస్ట్‌లపై ఆయన బుధవారం స్పందించారు. తలుపులు ధ్వం సం చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేయ డం దుర్మార్గం అని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టుల ను వెంటనే విడుదల చేయాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను బెదిరించి, భయపట్టే చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు.
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏం టీ? అని ప్రశ్నించారు. చట్టప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య లేదని, కానీ అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు చేయడానికి వారేమీ టెర్రరిస్టులు, పారిపోయే వారు కాదని స్పష్టంచేశారు. అసలు మహిళా ఐఏఎస్, మంత్రి అంశాన్ని మీడియాకు లీక్ చేసింది ఎవరు..? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఖండించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి ఎమర్జెన్సీ కాలపు లక్షణాలను ప్రదర్శించిందని మండిపడ్డారు. తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యంలో తీవ్రమైన నేరమని అభిప్రాయపడ్డారు.