చారిత్రక సత్యాలను వక్రీకరించిన కిషన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.
- తెలంగాణపై వివక్ష బయటపడింది
- విభజన చట్టంలో ఏడు మండలాల విలీన అంశం లేనే లేదు
- 2014లో ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వం అప్పగించినప్పటికీ, దీనికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంబంధం ఉందని చెప్పడం నయవంచన అని ధ్వజమెత్తారు.
యూపీఏ రూపొందించిన విభజన బిల్లులో ఏడు మండలాలు అప్పగించాలని ఇన్ బిల్ట్‌లో ఉందని అలవోకగా చెప్పారని మండిపడ్డారు. అసలు విభజన బిల్లులో ఏడు మండలాల బదలాయింపు అనే అంశం లేదని గుర్తుచేశారు.
పోలవరం ముంపు ప్రాంతాల సాకుతో..
2014 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రైవేశపెట్టి ఆమోదింపజేసిన విభజన బిల్లులో ఏడు మండలాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. అయితే, 2014 మేలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

