హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ)/ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ శనివారం మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభించిన మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు పాలమూరు నుంచి కాచిగూడ, కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, దువ్వాడ తదితర ముఖ్యమైన నగరాలను కలుపుతుందని తెలిపారు.