హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరిపారు.