వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న దేవస్థానం అవుట్ సోర్సింగ్ సిబ్బంది లక్ష్మణ్ నాగుపామును పట్టుకుని, పట్టణ శివారులోని ఖాళీ ప్రదేశంలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శివాలయంలో నాగుపాము కనిపించడంతో కొందరు దూరం నుండి దండం పెట్టుకోగా, కొందరు భయంతో పరుగులు తీశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది.. pic.twitter.com/vjUg08DlYO
— Namasthe Telangana (@ntdailyonline) April 26, 2022