హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు ఉండటం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రజలు రోడ్ల మీదకు రావాల్సిన దుస్థితి నెలకొంది తాజాగా హైదరాబాద్‌లోని(Hyderabad) ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట కిడ్నీ పేషేంట్స్ (Kidney patients) శాంతియుతంగా నిరసన(Protetst) తెలిపారు. ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కిడ్నీ పేషేంట్స్‌ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరిలో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్లో కలిసి విజ్ఞప్తి చేనా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. పెన్షన్ ఇచ్చి మాకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలిన ప్రభుత్వంను డిమాండ్ చేశారు. కిడ్నీ పేషేంట్స్ గత ప్రభుత్వం మాకు అన్ని చోట్లా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా ఉంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా కిడ్నీ పేషెంట్స్‌కు పెన్షన్ అందజేయాలన్నారు.
ప్రజా భవన్ ముందు కిడ్నీ పేషేంట్స్ శాంతియుతంగా నిరసన
ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కిడ్నీ పేషేంట్స్‌ను పట్టించుకోవడం లేదని ఆవేదన.
జనవరిలో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు… pic.twitter.com/keCS6bHGyB
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024