జడ్చర్ల టౌన్, జూలై 12 : చిన్నారి కిడ్నాప్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్‌బాబు కథనం మేరకు..ఇందిరానగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారి శైలజ(4) ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీఐ, ఎస్సై లెనిన్ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా శైలజ ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే.. మరోవైపు కిడ్నాప్‌నకు గురైన బాలిక సురక్షితంగా ఇంటికి చేరింది. సోషల్ మీడియాలో కిడ్నాప్ ఘటన హల్చల్ కావడంతో కిడ్నాపర్లు భయంతో చిన్నారిని విడిచిపెట్టి ఉండొచ్చని తెలుస్తున్నది. సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా బాలిక మేనత్తతోపాటు మరో వ్యక్తి కలిసి చిన్నారిని కిడ్నాప్ చేశారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.