Khammam | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభకు వెళ్తున్న వారితో పాటు వారి వాహనాలు అడ్డుకుంటున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ మినహా ఎక్కడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.