హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో శోభాయాత్ర కొనసాగుతున్నది. నాలుగో నంబర్ స్టాండు వద్ద గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. వెల్డింగ్ పనుల అనంతరం పూజలు నిర్వహించి గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. మహాగణపతి నిమజ్జనాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తజనసందోహంతో నిండిపోయాయి. కాగా, ఖైరతాబాద్ మహా గణేశుడు ట్యాంక్‌బండ్ చేరుకోవడంతో అబిడ్స్ నుంచి వస్తున్న చిన్న గణపతులను తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిలిపివేశారు. దీంతో నిర్వాకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.